పర్చూరు వై ఆర్ కె స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి 850 మంది హాజరుగా గా వారిలో వైద్యులు 350 మందిని కంటి చికిత్సలకు ఎంపిక చేశారు. ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ నోవా అగ్రిటెక్ లిమిటెడ్ మరియు, గుంటూరు పెదకాకానికి చెందిన శంకర్ నేత్రవైద్యశాల వైద్యులు ఈ శిబిరంలో వైద్య సేవలు అందించారు.