పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలోని ప్రభుత్వ హోమియో వైద్యశాల కనీస మౌలిక సదుపాయాలు లేక నిరాదరణకు గురవుతోంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్థానికులతో పాటు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఒంగోలు వంటి సుదూర ప్రాంతాల నుండి వందలాది మంది రోగులు చికిత్స కోసం వస్తున్నారు. అయితే, సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.