శుక్రవారం జరుగులవారిపాలెంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 720 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలను సహించబోమని ఎస్సై ఖాదర్ బాషా హెచ్చరించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.