పర్చూరు నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో అరుదైన గౌరవం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ పాలక మండలిలో విత్తన వినియోగ రైతుల ప్రతినిధిగా బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన మాలెంపాటి సత్యనారాయణను ప్రభుత్వం శుక్రవారం నామినేట్ చేసింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ జి. ఓ. ఆర్. టి నెం. 67ను విడుదల చేసింది. రెండు సంవత్సరాల పాటు ఆయన పాలక మండలి సభ్యుడిగా కొనసాగనున్నారు. ఈ నియామకంతో పర్చూరు నియోజకవర్గ రైతుల సమస్యలు నేరుగా రాష్ట్రస్థాయి వ్యవసాయ శాఖకు చేరనున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్చూరు నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.

సంబంధిత పోస్ట్