ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి (90) శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో అనారోగ్యంతో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం ఉదయం ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ నుండి పర్చూరు నియోజకవర్గం, ఇంకొల్లు మండలం, పావులూరులోని స్వగ్రామానికి తరలించనున్నారు.