సంతమాగులూరు మండలంలో 2014 నుంచి 2019 మధ్య నిర్మించిన ఎన్టీఆర్ గృహాల పెండింగ్ బిల్లులను చెల్లించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో జ్యోతిర్మయికి సోమవారం వినతిపత్రం ఇచ్చారు. అప్పటి ప్రభుత్వం ఈ బిల్లులు చెల్లించలేదని మండల కార్యదర్శి ఖాదర్ బాషా తెలిపారు. ఇప్పటి కూటమి ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు.