వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజిలో డేటా ఇంజినీరింగ్‌పై రెండు రోజుల శిక్షణా తరగతులు విజయవంతంగా ముగిశాయి. డేటా సైన్స్ విభాగంలోని రెండవ సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. తిరుపతికి చెందిన ఐడి యజన్ టెక్నాలజీ సంస్థ సహకారంతో జరిగిన ఈ శిక్షణ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణా రావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణ రావు తెలిపారు. ప్రిన్సిపాల్ డా కె.జగదీశ్ బాబు ఈ వివరాలను వెల్లడించారు.