యద్దనపూడి: రోడ్డు ప్రమాద క్షతగాత్రుని మృతి

మోటార్ సైకిల్ పై వస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన క్రమంలో పైన పెట్రోల్ పడటంతో మంటలు చెలరేగి తీవ్రంగా గాయపడిన చేబ్రోలు సుబ్బారావు అనే వ్యక్తి మరణించినట్లు యద్దనపూడి ఎస్సై రత్న కుమారి చెప్పారు. ఈ నెల 3వ తేదీన ఈ ప్రమాదం జరుగగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆప్పటినుండి చికిత్స పొందుతూ సుబ్బారావు శుక్రవారం మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్