తుఫాను బాధితులకు వైఎస్ఆర్సిపి నాయకుల నిత్యావసరాల పంపిణీ

పర్చూరు నియోజకవర్గంలోని ఇందిరానగర్ బోయ కాలనీలో ఎనిమిదవ వార్డులో తుఫాను బాధితులకు వైఎస్ఆర్సిపి నాయకులు నిత్యవసర వస్తువులను అందించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు, పర్చూరు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త గాద మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సహాయక చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కటారి అప్పారావు, జిల్లా ప్రజాస్ఆర్సీపీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోట శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ మల్లా అంజమ్మ, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్