అమరావతి: పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గురువారం భారీగా నీరు కృష్ణా నదిలో చేరింది. పరవళ్లతో నిండిన కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజ్ వైపు పరుగెత్తింది. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు స్థానికులు నది ఒడ్డునకు చేరారు. నదిలో ఈతలు, ప్రయాణాలు ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు. చుట్టుపక్కల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్