అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి: కొమ్మాలపాటి శ్రీధర్

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తీవ్రంగా ఖండించారు. శనివారం పెదకూరపాడులో విడుదల చేసిన ప్రకటనలో, రాజకీయ విభేదాలు సహజమే అయినా వ్యక్తిగత దూషణలు రాజకీయ సంస్కృతికి మచ్చ తెస్తాయని శ్రీధర్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రిపై అంబటి రాంబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్