గుంటూరు కొత్తపేటలోని ఇషా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి బోరుగడ్డ రజినీకాంత్ తల్లిని గురువారం ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ పరామర్శ కార్యక్రమంలో బలసాని కిరణ్ కుమార్‌తో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.