బెల్లంకొండలోని సీపీఐ కార్యాలయంలో శనివారం 16వ మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. పెదకూరపాడు నియోజకవర్గ కార్యదర్శి మునుగోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో 1925లో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.