చేనేత రంగానికి బడ్జెట్‌లో నిధులు: ప్రభుత్వాలకు సూచనలు

పెదకూరపాడు మండలం గారపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలి యల్లమందయ్య, చేనేత రంగానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేశారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ. 5 వేల కోట్లు కేటాయించి, క్లస్టర్లు, నూలు, రంగులు, రసాయనాలకు రాయితీలు, వర్క్‌షెడ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. అలాగే, ఫిబ్రవరి 11న రాష్ట్ర బడ్జెట్‌లో చేనేతకు రూ. 2 వేల కోట్లు కేటాయించి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 25 వేల చేనేత భరోసా పథకాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు చిల్లపల్లి సత్యం, గ్రామ కమిటీ అధ్యక్షులు నక్కా మల్లిఖార్జునరావు, పెదకూరపాడు నియోజకవర్గ అధ్యక్షులు చెన్నంసెట్టి బాజీ, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్