గుంటూరులో బాల్య వివాహాల నిర్మూలన కోసం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు గురువారం 'బాల్య వివాహ విముక్తి రథాన్ని' ప్రారంభించారు. 'బాల్య వివాహ ముక్త భారత్' లక్ష్యంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమం చేపట్టారు. సమాజానికి శాపంగా మారిన బాల్య వివాహాలను అడ్డుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1098, 112 లేదా 100 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించి చిన్నారుల భవిష్యత్తును కాపాడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.