పులిచింతల ప్రాజెక్టు వద్ద రైతుల ఆందోళన

గురువారం పెదకూరపాడు మండలం, పులిచింతల ప్రాజెక్టు వద్ద జడపల్లి తండా, కంచుబోడు తండాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. ప్రాజెక్టు గేట్లు ఒక్కసారిగా ఎత్తి ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో తమ పంట పొలాలు ముంపునకు గురై, భూమి కోతకు గురవుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల పంటలు పూర్తిగా నీటమునిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్