అమరావతి మండలంలో ఎరువులు, పురుగుమందుల విక్రయ కేంద్రాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏవో) జగ్గారావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ అనుమతి పొందిన నాణ్యమైన ఉత్పత్తులనే రైతులకు విక్రయించాలని దుకాణ యజమానులకు సూచించారు. స్టాక్ గోదాములను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేసి, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అమరావతి వ్యవసాయ అధికారి అహ్మద్‌తో పాటు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.