అమరావతిలో ఎండల తీవ్రత

అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఎండలు తీవ్రమయ్యాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడ్డారు. ఎండ తీవ్రత కారణంగా వాహనదారులు ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. వడదెబ్బ నివారణకు వైద్యులు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ వంటివి ఎక్కువగా తీసుకోవాలని, తరచూ నీరు తాగాలని సూచించారు. సెలవు రోజు కావడంతో చాలా మంది ఇళ్లలోనే ఉండటంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

సంబంధిత పోస్ట్