నదులు, నాగరికత తెలియని జగన్: చంద్రబాబు తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నదులు ఎక్కడ పుడతాయో, నాగరికత ఎక్కడ మొదలైందో కూడా జగన్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. సింధూ నాగరికత గురించి కూడా అవగాహన లేదని, నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ, లండన్ వంటి ప్రధాన నగరాలు నదీతీరాల వెంబడి అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. ప్రజలు బుద్ధి చెప్పినా, రాజధానిపై విషం చిమ్ముతూనే ఉన్నారని జగన్‌పై నిప్పులు చెరిగారు.

సంబంధిత పోస్ట్