పెదకూరపాడులో జర్నలిస్టుల ఆందోళన

జర్నలిస్టు జగన్ రెడ్డి హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (APUWJ) ఆధ్వర్యంలో పెదకూరపాడులో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిజాలను వెలికితీసే విలేకరులపై దాడులు చేయడం తీవ్రంగా ఖండనీయమని మండల అధ్యక్షుడు మునుగోటి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ ధనలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసనలో జర్నలిస్టులు విజయ భాస్కర్, బెన్ని బాబు, హనుమయ్య, అనిల్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్