క్రోసూరు మండల మార్కెట్ యార్డ్‌లో నేడు శనివారం ఉదయం 10 గంటలకు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. రైతుల సంక్షేమానికి ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలపై సమాచారాన్ని అందించనున్న ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.