పిడుగుపాటుతో గుడిసె దగ్ధం.. తప్పిన ప్రాణ నష్టం

వెల్దుర్తి మండలం లోయపల్లి గ్రామంలో మంగళవారం పిడుగుపాటు ఘటనలో మండ్లి నాసరయ్యకు చెందిన పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఆకస్మికంగా పిడుగు పడటంతో గుడిసెలో మంటలు చెలరేగి క్షణాల్లోనే అగ్నికి ఆహుతైంది. ఘటన సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, గృహోపకరణాలు, ధాన్యం, ఇతర సామగ్రి కాలిపోవడంతో నాసరయ్యకు గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లింది. గ్రామస్తులు మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినా, అవి వేగంగా వ్యాపించడంతో విఫలమయ్యారు.

సంబంధిత పోస్ట్