విజయవాడలోని దుర్గమ్మతల్లి కొండ కింద ఏడుస్తూ కనిపించిన ఐదేళ్ల నీలిమ అనే బాలికను అచ్చంపేటలో దుర్గారావు గుర్తించి, పోలీసులకు అప్పగించారు. బాలిక తన తండ్రి పేరు యేసు, తల్లి పేరు రెబ్కా అని, తాము విజయవాడకు చెందిన వారమని తెలిపింది. ప్రస్తుతం బాలిక పోలీసుల సంరక్షణలో ఉంది. తల్లిదండ్రులు లేదా బాలిక వివరాలు తెలిసిన వారు 9440796234 నంబర్‌కు లేదా అచ్చంపేట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సీఐ శ్రీనివాసరావు కోరారు.