పెదకూరపాడులో అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలకు, సమాజంలో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడటం వైసీపీ నాయకుల దురహంకారాన్ని మరోసారి బయటపెట్టిందన్నారు. మాజీ మంత్రి స్థాయిలో ఉండి దిగజారిన భాషను ఉపయోగించడం సమంజసం కాదన్నారు.