అమరావతి అంబేద్కర్ కాలనీలో శుక్రవారం దివ్యాంగులకు, వితంతువులకు ఇంటి వద్దకు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వెళ్లి పెన్షన్ పంపిణీ చేసి స్వయంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం చేయాలని, అర్హులైన వారికి నివేశ స్థలాలు ఇవ్వాలని కాలనీ వాసూలు కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాజా, గుడిసె కిరణ్, కూటమి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.