పల్నాడు జిల్లా రైతులు పత్తి, మిర్చి పంటలకు బదులుగా డిమాండ్ ఉన్న ఇతర పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ లు విజ్ఞప్తి చేశారు. పెదకూరపాడు నియోజకవర్గం, అమరావతి మండలంలోని దిడుగు గ్రామంలో 'రైతన్న మీకోసం- వంద రోజులు వంద గ్రామాలు' కార్యక్రమంలో పాల్గొన్న వారు, మునుగోడు సొసైటీ ద్వారా రైతులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.