కోనూరు గ్రామానికి చెందిన పసుపులేటి జనార్ధనరావు(జాలయ్య) వైసీపీ పార్టీ ఆవిర్భావ సమయం నుంచి సభ్యత్వం తీసుకొని పనిచేశానని ఆయన సోమవారం తెలిపారు. ఇటీవల కాలంలో పార్టీ మండల జనరల్ సెక్రటరీగా పదవి లభించిందన్నారు. తన వ్యక్తిగత కారణాల వల్ల సోమవారం పార్టీ సభ్యత్వానికీ, పదవికి రాజీనామా చేశానని, ఆ పత్రాన్ని పార్టీ కార్యాలయానికి అందించానని ఆయన చెప్పారు. ఇప్పటివరకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.