పెదకూరపాడు: గడ్డి కోసేందుకు వెళ్లి వ్యక్తి మృతి

పెదకూరపాడు మండలం బలుసుపాడు గ్రామంలో ఆదివారం బాబురావు అనే వృద్ధుడు గేదెలకు గడ్డి కోసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నీటి కుంటలో పడి మృతి చెందారు. ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువులు వెతకగా మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అమరావతికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్