గ్రామంలోని నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండే వారి సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకెళ్లాలని పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం పర్వీన్ అన్నారు. అచ్చంపేట మండలంలోని నాయకులతో సుపరిపాలనలో తొలి అడుగుపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి కృషి చేయాలని స్పష్టమైన దిశా నిర్దేశం నాయకులకు ఎమ్మెల్యే చేశారు.