నూతి బావిలో చిక్కుకున్న జింకను రక్షించిన పోలీసులు

కోసూరు గ్రామ శివారులో మంగళవారం దారితప్పి పొలాల్లోకి వచ్చిన ఓ చుక్కల జింక నూతి బావిలో పడిపోయింది. గ్రామస్తులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జింకను జాగ్రత్తగా బయటకు తీశారు. అనంతరం పిడుగురాళ్ల అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, ఫారెస్ట్ ఆఫీసర్ కె. నరసింహారెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకుని జింకను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జింకను సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.

సంబంధిత పోస్ట్