అమరావతి మండలంలో 33 కెవి విద్యుత్ లైనులో మరమ్మతులు చేపట్టనున్న కారణంగా విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ అందుబాటులో ఉండదని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. రవికిరణ్ శుక్రవారం తెలిపారు. వినియోగదారులు ముందుగానే ఏర్పాట్లు చేసుకొని సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.