గుంటూరు జీజీహెచ్‌లో రూ.100 కోట్ల దాతల నిధులతో నిర్మించిన అత్యాధునిక మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ ఐదు అంతస్తుల భవన ఏర్పాట్లను ఎమ్మెల్యే నజీర్ గురువారం పర్యవేక్షించారు. దాతల సహకారంతో పేదలకు మెరుగైన వైద్యం అందడం శుభపరిణామమని, ఎటువంటి ఆటంకం లేకుండా పర్యటన విజయవంతం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.