లింగాపురంలో ఎండవాన.. ఆసక్తిగా వీక్షించిన ప్రజలు

అమరావతి మండలం లింగాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం అరుదైన వాతావరణ పరిస్థితులు కనిపించాయి. ఎండ వెలుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని చిరుజల్లులు కురవడంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లింగాపురం చెరువుకట్ట నుంచి బలుసుపాడు మలుపు వరకు ఈ ఎండవాన దృశ్యం కనిపించింది. అకస్మాత్తుగా వాతావరణం మారడంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విభిన్న వాతావరణం స్థానికులను ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్