దుగ్గిరాల మార్కెట్‌లో బుధవారం పసుపు ధరలు ఆశాజనకంగా నమోదయ్యాయి. మార్కెట్ యార్డు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తాజా వేలంలో పసుపు క్వింటాల్ గరిష్ఠంగా రూ. 14,011 పలికింది. కొమ్ము రకం పసుపు ధర రూ. 10,387 నుండి రూ. 14,011 మధ్య, కాయ రకం రూ. 12,250 నుండి రూ. 14,011 వరకు ధర పలికింది. నాణ్యమైన పంటను తెచ్చే రైతులకు మంచి లాభాలు అందుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.