వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులో గురువారం జరిగిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై, ఎంపికైన 1150 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. 36 ప్రముఖ కంపెనీలు పాల్గొన్న ఈ మేళా ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు. యువత తమ నైపుణ్యాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.