రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డిని కలిసిన అంబటి మురళీకృష్ణ

పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, శుక్రవారం తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, వైవి సుబ్బారెడ్డి పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన అనుబంధ విభాగాల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని మురళీకృష్ణకు సూచించారు. అలాగే, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి, సమన్వయంతో పనిచేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్