మంగళవారం తహసిల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ నాయకులు దండా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ డిమాండ్లను నెరవేర్చాలని ధర్నా నిర్వహించారు. ప్రభుత్వము అంగన్వాడీల వేతనాలను పెంచాలని, అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేయాలని, ప్రభుత్వ పథకాలను అంగన్వాడీలకు అందించాలని దండా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల లీడర్ ఎం.వి. సుకన్య పాల్గొన్నారు.