అపరాల పైరు తెగుళ్లపై రైతులకు అవగాహన కార్యక్రమం

పొన్నూరు మండలం సీతారామపురం, ఉప్పరపాలెం గ్రామాలలో బుధవారం జరిగిన 'పొలం పిలుస్తుంది' కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి గ్రేడ్ 1 శ్రీకాంత్ పాల్గొన్నారు. అపరాల పంటల్లో బూడిద తెగులు నివారణకు మైకోబుటానిల్ (ఇండెక్స్) ఎకరాకు 100 గ్రాములు లేదా హెక్సాకొనాజొల్ (కాంటాఫ్) 50-70 మి.లీ పిచికారి చేయాలని సూచించారు. తెల్ల దోమ, తామర పురుగుల ద్వారా వ్యాపించే వైరస్ తెగుళ్లను అరికట్టడానికి గట్లపై కలుపు లేకుండా చూడాలని రైతులకు సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్