జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని డిమాండ్ చేశారు. ఈ హత్యకు నిరసనగా బుధవారం చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి, ఎమ్మార్వో గోపిక్రిష్ణకు వినతిపత్రం అందజేశారు. ప్రజల గొంతుకైన జర్నలిస్టులపై దాడులు దుర్మార్గమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీం, రహమాన్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.