పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు సంగం డెయిరి చైర్మన్ శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 24 చెక్కులను ₹ 10,39,385 రూపాయల మొత్తాన్ని చేబ్రోలు మండలంలోని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.