పొన్నూరు లో అంగ వైకల్య నిర్ధారణ శిబిరం

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం సమగ్ర శిక్ష, సహితవిద్యా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు వైకల్య నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని మండల విద్యాశాఖాధికారి కె. విజయభాస్కర్ ప్రారంభించారు. లింకో వైద్య బృందం చిన్నారులను పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉపకరణాలను సూచించారు. కార్యక్రమంలో జిల్లా సహితసంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్