పెదకాకాని మండలంలోని వివిధ గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న 11 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 8,12,085/- చెక్కులను పొన్నూరు ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పంపిణీ చేశారు. ఈ ఆర్థిక సహాయం తమ కుటుంబాలకు ఎంతో అండగా ఉంటుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని వారు తెలిపారు.