పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ఆదేశాల మేరకు, పెదకాకాని మండల కూటమి పార్టీ ఆధ్వర్యంలో వైస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబుపై సీఎం చంద్రబాబు నాయుడుపై అసభ్య పదజాలం వాడినందుకు పెదకాకాని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని కోరుతూ పిర్యాదు చేశారు. అనంతరం అంబటి రాంబాబు దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కూటమి పార్టీ నాయకులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ అనుబంధ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.