పొన్నూరు పట్టణంలోని 1, 2 వార్డులలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు శిబిరాన్ని బుధవారం జనసేన పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త వడ్రాణం మార్కండేయ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులుగా నమోదు చేసుకున్నారు. జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు గోపికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మార్కండేయ బాబు సభ్యుల నమోదు విధానాలను పరిశీలించి, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు.