జాతీయ కార్మిక, కర్షక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు జిల్లా దండా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. పొన్నూరు అంబేద్కర్ సెంటర్లో జరిగిన కార్మిక సంఘాల జీబీ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు పుప్పాల సత్యనారాయణ, మేడీ హనుమంతరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి. జగన్నాథం పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.