గుంటూరు జిల్లా పెదకాకాని రైల్వే స్టేషన్ లో బుధవారం ఓ వ్యక్తి గొంతుకోసి హత్యకు గురయ్యాడు. మృతుడు రైల్వే ప్రయాణికుడా లేక వేరే చోట హత్య చేసి ఇక్కడికి తరలించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెదకాకాని పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.