పెదకాకాని మండలం నంబూరులోని శ్రీ శ్రీ శ్రీ రాధా గోవింద మందిరంలో శ్రీకృష్ణ బలరామ్ స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్, ఆయన సతీమణి జ్యోతిర్మయి పాల్గొన్నారు. ఎమ్మెల్యే దంపతులు స్వామివారి ఆశీస్సులు స్వీకరించి, ప్రజల సుఖశాంతులు, ఐశ్వర్యం, ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.