పొన్నూరు పట్టణంలోని ముస్లింల అభివృద్ధికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కృషి ఎనలేనిదని జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు షేక్ బాజీ షాహెబ్ పేర్కొన్నారు. శుక్రవారం 25వ వార్డులో షాదీఖానా వద్ద ముస్లిం మైనార్టీ నాయకులతో ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని ముస్లింల ఉన్నతికి రూ. 2.85 కోట్లు మంజూరు చేయించి షాదీఖానా నిర్మిస్తున్నందుకు ముస్లిం మైనార్టీల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ముస్లింలను విస్మరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.