నంబూరులో నాగారపమ్మ అమ్మవారి ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ దంపతులు

పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో మాఘ మాస శుక్లపక్ష పౌర్ణమి సందర్భంగా శ్రీ నాగారపమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ పూజల్లో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్, ఆయన సతీమణి శ్రీమతి జ్యోతిర్మయి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి కోసం ఎమ్మెల్యే దంపతులు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్