వైద్య వృత్తి తో పాటు సేవాభావం కలిగి ఉండాలి

పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామంలోని సిబాద్ వైద్యశాలలో గురువారం 25వ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక అతిధి డాక్టర్ అశోక్ దోబ్లే మాట్లాడుతూ, విద్యార్థులందరూ ఇటువంటి అద్భుతమైన కళాశాలలో విద్య నేర్చుకోవడం గొప్ప అవకాశమని, భవిష్యత్తుకు సిద్ధమయ్యే విద్యార్థులను తీర్చిదిద్దుతున్న సిబాద్ కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులను అభినందించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సమాజంలో ఉత్తమ దంత వైద్యులుగా ఎదుగుతూ సేవాభావంతో పనిచేయాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్